Amala Paul: నటి అమలాపాల్ మెడకు కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం.. విచారణకు గవర్నర్ ఆదేశం

  • పన్ను ఎగవేసేందుకు నటి ఎత్తుగడ
  • తప్పుడు చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్
  • పలువురు నటులపైనా ఇవే ఆరోపణలు

కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం నటి అమలాపాల్ మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు. అమలాపాల్ గతేడాది పుదుచ్చేరిలో ‘బెన్స్ ఎస్ క్లాస్’ అనే కారును రూ.1.12 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కారును ఆమె సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాల్సింది వస్తుందని భావించిన అమలాపాల్ పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

 ఈ కారును ఆమె ప్రస్తుతం కేరళలో వినియోగిస్తోంది. కారు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జోరుగా వార్తలు రావడంతో స్పందించిన గవర్నర్ ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అమలాపాల్‌, నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి తక్కువ పన్నులు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు.

More Telugu News