kimjong un: ఉత్త‌ర‌కొరియాలో అణు బాంబు ప‌రీక్ష పేలుడు ధాటికి 200 మంది మృతి: జ‌పాన్

  • యుద్ధ భ‌యం రేపుతోన్న‌ ఉత్తర కొరియా
  • ఇటీవ‌ల అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన ఉ.కొరియా
  • సొరంగం కుప్పకూలి పోవ‌డంతో కార్మికులు మృతి

యుద్ధ భ‌యం రేపుతోన్న‌ ఉత్తర కొరియా కొన్ని రోజుల క్రితం అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ బాంబు పరీక్ష సమయంలో ఆ ధాటికి ఓ సొరంగం కుప్పకూలి పోవ‌డంతో 200 మంది చనిపోయినట్లు జపాన్‌కు చెందిన ఆసహి టీవీ చానెల్ తాజాగా వెల్ల‌డించింది.

ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్యే-రీ ప్రాంతంలో సెప్టెంబ‌ర్ 3న‌ ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని చెప్పింది. పేలుడు ధాటికి అక్క‌డి ప్రాంతమంతా తీవ్ర ప్రభావానికి లోను కావ‌డంతో సొరంగం కూలి, 200 మంది కార్మికులు మృతి చెందార‌ని తెలిపింది.   

  • Loading...

More Telugu News