brahmaji: అలాంటివాళ్లు ఇండస్ట్రీలో కొంతకాలమే వుంటారు : బ్రహ్మాజీ

  • సక్సెస్ అనేది టీమ్ వర్క్ 
  • నేనే గొప్ప అనుకున్నవాళ్లు చాలామంది వెళ్లిపోయారు 
  • గుర్తుపట్టేసి జనం వచ్చి మీద పడిపోతారనుకోవడం భ్రమ
  • కామన్ మేన్ గా ఉండటమే నాకు ఇష్టం  

నటుడిగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మాజీ అనేక విషయాలను ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. "సినిమాల్లోకి వచ్చిన తరువాత కొంతమంది నేనే సినిమా .. నా వల్లే సినిమా అనుకుంటూ ఉంటారు. సక్సెస్ అనేది టీమ్ వర్క్  .. అది మరిచిపోయి నేనే గొప్పవాడినని ఫీలైన వాళ్లు ఇండస్ట్రీలో వుండరు" అని చెప్పారు. "దర్శకులు .. నిర్మాతలు .. రచయితలు .. తోటి నటీనటులు .. ఇలా అంతా హెల్ప్ చేయడం వల్లనే కెరియర్ కొనసాగుతుందనుకుంటే హ్యాపీ" అని అన్నారు.

"సినిమాల్లో వేషాలు ఎప్పటికీ వుంటాయని అనుకోవద్దు .. నేను గొప్ప అనే భ్రమలో వుండకూడదు. నేను సెలబ్రిటీని .. బయటికి వెళితే జనం గుర్తుపట్టేసి మీద పడిపోతారని ఇంట్లోనే బిగుసుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు. రేపటి  రోజున సినిమాలు లేకపోతే బయటికి రాలేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. స్టార్ హీరోల విషయంలో జనం మీద పడిపోవడం జరుగుతుందేమోగానీ, మిగతా వాళ్ల విషయంలో అలా జరగదు. మా ఇంట్లోకి కావలసిన కూరగాయలను నేనే కొంటా .. సూపర్ మార్కెట్లకు నేనే వెళతా .. బ్యాంక్ కి నేనే వెళతా. కామన్ మేన్ గా బతకడమే నాకు ఇష్టం" అని స్పష్టం చేశారు.        

  • Loading...

More Telugu News