gst: జీఎస్టీ విషయంలో.. రెస్టారెంట్లు, మాల్స్ కు కొత్త రూల్స్ పెట్టబోతున్న కేంద్రం!

  • జీఎస్టీతో కలిపి ఎమ్మార్పీ ధరలు ముద్రించాలి
  • అసలు ధర, జీఎస్టీ రెండూ కనిపించాలి
  • త్వరలో రానున్న కొత్త నిబంధనలు

వినియోగదారుల నుంచి అప్పనంగా డబ్బును గుంజేస్తున్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, షాపింగ్ ఔట్ లెట్లకు కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. అన్ని ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే ఎమ్మార్పీని ముద్రించాలంటూ ఆదేశాలు జారీ చేయబోతోంది. అసోం ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన గ్రూప్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి జీఎస్టీ అమలుతో వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... వ్యాపారులు మాత్రం దొరికినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్థికమంత్రులతో గ్రూప్ ను ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో, ఎమ్మార్పీకి మించి ఎక్కవ వసూలు చేస్తే, నేరం చేసినట్టేనని మంత్రుల గ్రూపు సూచించింది. వస్తువు ధర ఎంత? దానిపై జీఎస్టీ ఎంత? అనే వివరాలు కూడా ఉండాలని తెలిపింది. నవంబర్ 10న జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించనుంది. 

More Telugu News