indian film industry: భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లోకి మ‌రో అడ‌ల్ట్ స్టార్‌... మ‌ల‌యాళం సినిమాలో మియా ఖ‌లీఫా

  • అడ‌ల్డ్ సినిమా చంక్జ్ 2 లో న‌టించనున్న మాజీ పోర్న్ స్టార్‌
  • స్ప‌ష్టం చేసిన చిత్ర ద‌ర్శ‌కుడు
  • ఐటెమ్ డాన్స్ కూడా

స‌న్నీ లియోన్ త‌ర్వాత మ‌రో అడ‌ల్ట్ స్టార్ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నుంది. మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా త్వ‌ర‌లో ఓ మ‌ల‌యాళం సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో వ‌చ్చిన చంక్జ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న చంక్జ్ 2 చిత్రంలో మియా ఖ‌లీఫా ఓ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నట్లు, సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కి కూడా న‌ర్తించనున్నట్టు చిత్ర ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులూ తెలిపారు. మే 2018లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, ప్ర‌స్తుతం 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌లిస్టుగా మియా ఖ‌లీఫా ప‌నిచేస్తోంది.

More Telugu News