surya: సంక్రాంతి బరిలోకి సూర్య కూడా దిగేస్తున్నాడు

  • సూర్య తాజా చిత్రంగా 'తానా సెరిందా కూట్టమ్'
  • దర్శకుడిగా విఘ్నేశ్ శివన్ 
  • కథానాయికగా కీర్తి సురేశ్
  • తమిళంతో పాటు తెలుగులోను విడుదల

సూర్య తాజా చిత్రంగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'తానా సెరిందా కూట్టమ్' చిత్రం తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారని సమాచారం. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.

 తెలుగు ఆడియన్స్ లోను సూర్యకి మంచి క్రేజ్ వుంది. అయితే కొంత కాలంగా ఇక్కడి నుంచి ఆయనకి సరైన హిట్ వెళ్లలేదు. ఇక తెలుగులో సంక్రాంతికి సినిమాల మధ్య వుండే పోటీనే వేరు. అలాంటిది ఆ సమయంలో సూర్య సినిమాను వదలడమంటే అది కొంచెం సాహసమేనని చెప్పాలి. మరి ధైర్యంగా సంక్రాంతి బరిలోకి దిగుతోన్న సూర్యకి సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.    

  • Loading...

More Telugu News