pavan: మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసిన పవన్ .. ఆ ఫైట్ సినిమాకే హైలైట్!

  • పవన్ తో త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' 
  • ఈ సినిమా కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఫైట్
  • ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం
  • ప్రస్తుతం యూరప్ లో పాటల చిత్రీకరణ  

త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కథా కథనాలే కాదు, పాటలు .. ఫైట్లు కూడా ప్రత్యేకంగా అనిపించాయి. అలాగే ఈ సినిమాలోను ఫైట్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా ఈ ఫైట్స్ వుంటాయని అంటున్నారు.

 పవన్ కి మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం వుంది. అయినా ఈ సినిమా కోసం రెండు నెలల పాటు ఆయన ప్రాక్ట్రిస్ చేశాడట. ఓకే అనుకున్న తరువాత ఇటీవల షెడ్యూల్ లోనే ఈ ఫైట్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందనీ  .. సినిమాకి ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఈ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ యూరప్ లో పాటలను చిత్రీకరించే పనిలో ఉందనే సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News