lavanya tripathi: నిర్మాతలకు హ్యాండిచ్చిన లావణ్య త్రిపాఠి.. నష్ట పరిహారం చెల్లించాలంటోన్న నిర్మాతలు!

  • కొత్త కథానాయికల నుంచి పోటీ 
  • లావణ్య త్రిపాఠికి తగ్గుతోన్న అవకాశాలు 
  • ఆమెపై తమిళ నిర్మాతల ఫిర్యాదు
తెలుగు తెరపై కొత్త కథానాయికలు దూసుకుపోతున్నారు. దాంతో వాళ్ల పోటీని తట్టుకుని నిలబడటం లావణ్య త్రిపాఠికి కష్టమవుతోందనే చెప్పాలి. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలోను ఆమె పాత్ర పరంగా .. గ్లామర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోను ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో '100% లవ్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో హఠాత్తుగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వలన తాము నష్టపోయామనీ, నష్ట పరిహారంగా 3 కోట్లు ఇప్పించమని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను ఆశ్రయించారు. కౌన్సిల్ నిర్ణయం నిర్మాతలకి అనుకూలంగా వుండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి ఏం చేస్తుందో చూడాలి మరి.            
lavanya tripathi

More Telugu News