kimjong un: కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా ప‌లుచోట్ల తిరుగుతోన్న ఉ.కొరియా అధ్య‌క్షుడు కిమ్!

  • ఎల్ల‌ప్పుడూ యుద్ధం గురించే ఆలోచించే కిమ్ జాంగ్ ఉన్‌
  • మీడియాపై ఎన్నో ఆంక్ష‌లు పెట్టే ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు
  • కిమ్ కు సంబంధించిన వార్త‌లు, ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డం చాలా అరుదు
  • ప్యాంగ్యాంగ్‌లోని ఓ కాస్మెటిక్స్‌ ఫ్యాక్టరీని సంద‌ర్శించిన కిమ్‌

మూడ‌వ ప్ర‌పంచ యుద్ధ భ‌యం రేపుతోన్న‌ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్ అప్పుడప్పుడు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. 'యుద్ధం, అణు బాంబులు, క్షిప‌ణి ప‌రీక్ష‌లు ఎప్పుడూ ఇవేనా' అని ఆయ‌న‌కు కూడా అనిపిస్తుందేమో.. తాజాగా తన భార్య, సోదరితో కలిసి టూర్‌కు వెళ్లారు. త‌మ దేశ రాజ‌ధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ కాస్మెటిక్స్‌ ఫ్యాక్టరీని ఆయ‌న సంద‌ర్శించారు. అక్క‌డ తయారు చేస్తోన్న కాస్మెటిక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.

హాయిగా న‌వ్వుతూ ఎంజాయ్ చేశారు. కిమ్‌ తన భార్య రి సోల్‌ జు, సోదరి కిమ్‌ యో జాంగ్‌తో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫ్యాక్టరీ యాజ‌మాన్యాన్ని కిమ్ ప్రశంసించారని అక్క‌డి మీడియా పేర్కొంది. త‌మ దేశ మీడియాపై ఎన్నో ఆంక్ష‌లు విధించే కిమ్ జాంగ్ ఉన్ కు సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత వార్త‌లు అరుదుగా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి.   

  • Loading...

More Telugu News