varun tej: మెగా హీరో తాజా చిత్రం విడుదల తేదీ ఖరారు!

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్  
  • నిర్మాతగా బీవీఎస్ ఎన్ ప్రసాద్
  • కథానాయికగా రాశి ఖన్నా
  • సంగీత దర్శకుడిగా తమన్

ఈ ఏడాది 'ఫిదా' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్, అప్పటి నుంచి తన తదుపరి సినిమాపైనే దృష్టి పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం రూపొందుతూ వస్తోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

 ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ పై వరుణ్ తేజ్ పూర్తి నమ్మకంతో వున్నాడు. కొత్త సంవత్సరంలో ఈ సినిమాతో తొలి సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి మరి.       

More Telugu News