venkatesh: మళ్లీ గ్రామీణ నేపథ్యమే .. వెంకీ, చైతూలతో కల్యాణ్ కృష్ణ

  • రెండు హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ 
  • మూడవ సినిమాగా మల్టీ స్టారర్ 
  • త్వరలోనే సెట్స్ పైకి

సినిమా కథలన్నీ విదేశాలలో విహరిస్తోన్న సమయంలో, దర్శకుడు కల్యాణ్ కృష్ణ గ్రామీణ నేపథ్యంలో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాడు. నాగార్జున కథానాయకుడిగా చేసిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ తరువాత కొన్ని సినిమాలు పల్లె బాట పట్టి .. మంచి విజయాలను అందుకున్నాయి. ఆ జాబితాలో 'శతమానం భవతి' .. 'ఫిదా' సినిమాలు కనిపిస్తుండగా, 'రంగస్థలం' సెట్స్ పై వుంది.

 ఈ క్రమంలో వెంకటేశ్ .. నాగచైతన్యలతో కల్యాణ్ కృష్ణ ఒక మల్టీస్టారర్ ను తెరకెక్కించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కథ కూడా గ్రామీణ నేపథ్యంలోనే కొనసాగుతుందట. నిజ జీవితంలో వెంకటేశ్ .. చైతూ .. మేనమామ - మేనల్లుడు. అదే వరుస గల పాత్రలను వాళ్లు ఈ సినిమాలో పోషించనుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. విలేజ్ నేపథ్యంతో కూడిన కథతో కల్యాణ్ కృష్ణ మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.     

  • Loading...

More Telugu News