revant reddy: రేవంత్ వెనుక నడిచే ఉద్దేశంతో టీడీపీకి రాజీనామా చేసిన మరింత మంది నేతల పేర్లు!

  • రాజీనామా చేసిన కరీంనగర్ టీడీపీ ప్రెసిడెంట్
  • పదవికి రిజైన్ చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ
  • అదే దారిలో పలువురు సినియర్ నేతలు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి వెంట నడిచేందుకు పలువురు టీడీపీ నేతలు సిద్ధమై, తమతమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. తాజాగా, కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్‌ చార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన రేవంత్ వెంట ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.

వేములవాడకు చెందిన సీనియర్ నేతలు ఎంఎ. నసీర్, నందిపేట సుదర్శన్‌ యాదవ్‌, పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, ముంజ ఉమేందర్‌ గౌడ్, నందిపేట రమణయాదవ్, చింతలకోటి రామస్వామి తదితరులు కూడా పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. కొంతమంది రేవంత్ తో వెళ్లాలని అనుకుంటుండగా, మరికొందరు కాంగ్రెస్ కన్నా, టీఆర్ఎస్ లో చేరితే మంచిదని భావిస్తున్నారు.

ఇక నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా నేడు రాజీనామాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు వచ్చే నెల 9న రాహుల్ గాంధీ బహిరంగ సభ నాటికి టీడీపీని వీడతారని తెలుస్తోంది.
revant reddy
congress
warangal
rahul gandhi

More Telugu News