200 మంది బౌన్సర్ల రక్షణలో నయనతారపై పాట చిత్రీకరణ!

30-10-2017 Mon 10:02
  • నయనతార తాజా చిత్రంగా 'వేలైక్కారన్' 
  • దర్శకుడిగా మోహన్ రాజా 
  • హీరోగా శివకార్తికేయన్ 
  • రాజస్థాన్ .. కిషన్ ఘడ్ లో భారీ సెట్
తెలుగు .. మలయాళ భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తూ వెళుతోన్న నయనతార, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. సీనియర్ హీరోలతోనే కాకుండా కుర్ర హీరోలతోనూ ఆమె సినిమాలు చేస్తూ వెళుతుండటం విశేషం. అలా ప్రస్తుతం నయనతార .. మోహన్ రాజా దర్శకత్వంలో .. శివకార్తికేయన్ సరసన ఒక సినిమా చేస్తోంది. 'వేలైక్కారన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ మురికివాడకి చెందిన యువకుడిగా శివకార్తికేయన్ కనిపించనున్నాడు.

 ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ ను రాజస్థాన్ - కిషన్ ఘడ్ ప్రాంతంలోని మార్బల్ లో ఒక పాటను చిత్రీకరించారట. మంచు కురుస్తున్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసి .. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ పాటను తెరకెక్కించారని చెబుతున్నారు. ముందుగా ఈ పాటను కాశ్మీర్ లో ప్లాన్ చేశారట. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, ఇక్కడ చిత్రీకరించారు. స్థానికులు షూటింగ్ కి అంతరాయం కలిగించకుండా ఉండటం కోసం, 200 మంది బౌన్సర్లను రక్షణగా నియమించుకుని ఈ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారట.