drunken drive: పీకలదాకా మద్యం తాగిన యువతి... జూబ్లీహిల్స్ లో పోలీసులకు చెప్పు చూపించి హంగామా... వీడియో చూడండి!

  • ప్రమాదకరంగా కారును నడిపిన యువతి
  • బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు ససేమిరా
  • పరీక్షించగా, అతిగా మద్యం తాగినట్టు నిరూపణ
  • వైరల్ అవుతున్న వీడియో
పీకలదాకా మద్యం తాగిన ఓ యువతి, ప్రమాదకరంగా తన కారును నడుపుకుంటూ రావడంతో పాటు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికిపోయి, వారిని ముప్పు తిప్పలు పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు అంగీకరించకుండా, వారిని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయింది. గతరాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ జరుగగా, ఆమెను అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది.

చివరికి ఎలాగోలా ఆమెకు పరీక్షలు నిర్వహించగా, అధికమోతాదులో మద్యం తాగినట్టు నిరూపితం కావడంతో, ఆమె వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని, కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులకు చెప్పు చూపించిన విషయమై, ఆమెను హెచ్చరించనున్నామని, తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మరో కౌన్సెలింగ్ ఇస్తామని అన్నారు. ఆ అమ్మాయి నిర్వాకమంతా మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ గా మారింది. సదరు వీడియోను మీరూ చూడవచ్చు.
drunken drive
police
jublehills

More Telugu News