Afghanistan: పాకిస్థాన్‌లో కిడ్నాపైన ఆఫ్ఘనిస్థాన్ ప్రావిన్షియల్ డిప్యూటీ గవర్నర్.. పోలీసుల వెతుకులాట

  • కిడ్నీ చికిత్స కోసం పాక్ వచ్చిన డిప్యూటీ గవర్నర్ ఖాజీ మొహమ్మద్
  • అపహరించిన సాయుధ దుండగులు
  • సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

ఆఫ్ఘనిస్థాన్ డిప్యూటీ గవర్నర్ ఒకరు పాకిస్థాన్‌లో కిడ్నాపయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు కునార్ ప్రావిన్షియల్ డిప్యూటీ గవర్నర్ అయిన ఖాజీ మొహమ్మద్ నబీ అహ్మదీని పాకిస్థాన్‌లోని ఖైబర్-ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు పెషావర్‌లోని ఆఫ్ఘాన్ కౌన్సిల్ జనరల్ ప్రకటన చేశారు.

అయితే, అహ్మది కిడ్నాప్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అహ్మది చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్టు అహ్మది సోదరుడు హబీబుల్లా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, డిప్యూటీ గవర్నర్ తన వెంట ఎటువంటి  అధికారిక పత్రాలు కానీ, పాస్‌పోర్టు కానీ తీసుకురాలేదని డాన్ పత్రిక తెలిపింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు గవర్నర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News