ntr bio pic: తేజ 'ఎన్టీఆర్ బయోపిక్'లో చంద్రబాబు, హరికృష్ణ వీరే!

  • తేజ సంప్రదింపులు జరిపారంటూ వార్తలు
  • సరిగ్గా సరిపోతారంటున్న టాలీవుడ్ వర్గాలు
  • అధికారికంగా ఇంకా వెల్లడించని తేజ
వచ్చే సంవత్సరం ఆరంభంలో బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్న దివంగత సీఎం ఎన్టీరామారావు జీవిత కథ ఆధారిత చిత్రంలో అత్యంత కీలకమైన చంద్రబాబునాయుడు, హరికృష్ణ పాత్రలు ఎవరు పోషిస్తారన్న విషయమై మరో లీక్ బయటకు వచ్చింది.

చంద్రబాబునాయుడి పాత్ర కోసం జగపతిబాబును, ఎన్టీఆర్ కుమారుడిగా, ప్రజల్లోకి వెళ్లినప్పుడల్లా వెన్నంటి ఉంటూ, ఆయన వాహనాన్ని స్వయంగా నడిపిన హరికృష్ణగా కల్యాణ్ రామ్ ను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో తేజ నుంచిగానీ, నిర్మాత బాలయ్య నుంచిగానీ అధికారిక సమాచారం రాకున్నా, వీరిద్దరి పేర్లూ బయటకు వచ్చినప్పటి నుంచి ఇద్దరూ సరిగ్గా సరిపోతారని మాత్రం ఫిలింనగర్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
ntr bio pic
teja
balakrishna
jagapati babu
kalyan ram

More Telugu News