indian army: సైన్యానికి కొత్త ఆయుధాల కోసం రూ. 40 వేల కోట్లు... ఏమేం కొంటారంటే..!

  • పాతబడిన ఆయుధాల స్థానంలో కొత్తవి
  • 44,600 కార్బైన్స్, 44 వేల ఎల్ఎంజీల అవసరం
  • 7 లక్షల రైఫిల్స్ కావాలంటున్న సైన్యం
  • కొత్త వాటి కోసం నూతన నాణ్యతా నిబంధనలు

భారత సైన్యానికి సరికొత్త ఆయుధాల కోసం రూ. 40 వేల కోట్లను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సైన్యం వద్ద ఉన్న పాతబడిన ఆయుధాల రీప్లేస్ మెంట్ కోసం ఈ నిధులను వాడనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ డబ్ళుతో లైట్ మెషీన్ గన్స్, బ్యాటిల్ కార్బైన్ లను, అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.

కాగా, ప్రస్తుతం అధికారిక అంచనాల ప్రకారం, సైన్యానికి 7 లక్షల రైఫిల్స్, 44 వేల లైట్ మెషీన్ గన్స్, 44,600 కార్బైన్స్ అవసరం ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించగా, పూర్తి అవసరాలను తీర్చలేకున్నా, ప్రస్తుతానికి ఈ డబ్బుతో సర్దుకోవాలని కేంద్రం కోరినట్టు తెలుస్తోంది. చైనా, పాకిస్థాన్ ల నుంచి ముప్పు పొంచి వున్నందున, సైనికావసరాలను తీర్చడం తప్పనిసరని భావించిన మీదటే ఈ నిధులను విడుదల చేసినట్టు సమాచారం.

ఇక ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైనిక బలాన్ని కలిగివున్న భారత్ వద్ద పలు రకాల ఆయుధాలు పాతబడిపోయాయి. వీటన్నింటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని చానాళ్లుగా సైన్యం ఇండెంట్ లను పెడుతూనే ఉంది. ఇక చిన్న చిన్న ఆయుధాలు, ఎల్ఎంజీ (లైట్ మెషీన్ గన్స్) కోసం దేశవాళీ సంస్థలైన డీఆర్డీవో వంటి కంపెనీలపై ఆధారపడాలని, అవసరమైతేనే విదేశీ కంపెనీల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రక్షణ శాఖకు ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది.

కొత్త అసాల్ట్ రైఫిల్స్ ఎలాంటి నాణ్యతతో ఉండాలన్న విషయమై డీఏసీ (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) నుంచి అనుమతులు లభించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇషాపూర్ లోని ప్రభుత్వ రంగ రైఫిల్ ఫ్యాక్టరీలో తయారయ్యే రైఫిల్స్ ను ఆర్మీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ తుపాకులు పరీక్షలను తట్టుకుని నిలబడలేకపోయాయి. ఆ తరువాతనే రైఫిల్స్ ఎలా ఉండాలన్న విషయమై కొన్ని నియమాలను తయారు చేయగా, వాటిని డీఏసీ అనుమతించింది.

  • Loading...

More Telugu News