revant reddy: చంద్రబాబు ఆశీర్వాదం తీసుకునే వచ్చా: కార్యకర్తలతో రేవంత్ కీలక వ్యాఖ్యలు

  • భవిష్యత్తులో అండగా ఉండాలని కోరాను
  • కనకదుర్గమ్మకు కూడా దండం పెట్టే వచ్చాను
  • మీ అభిమానమే నా అండ దండ
  • చంద్రశేఖరరావుకు గుణపాఠం చెబుతా
పార్టీ మారాలని తాను నిర్ణయించుకున్న తరువాత, ఇంతకాలం తనను ఆదరించిన చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాను అమరావతిలో చంద్రబాబును కలిసి, మనసులోని మాట చెప్పానని, భవిష్యత్తులోనూ ఆయన అండ, దండ ఉండాలని కోరి వచ్చానని అన్నారు.

 తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "నేను అమరావతిలో చంద్రబాబునాయుడిని కలిసి, తెలంగాణలో ఉన్న పరిస్థితులను గురించి వివరించి, వారి ఆశీర్వాదం తీసుకుని, బెజవాడ కనకదుర్గమ్మకు దండం పెట్టుకుని కొడంగల్ కు బయలుదేరి వచ్చినా. ఇవాళ కూడా కొడంగల్ గుడికెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని మీ ముందుకు వచ్చినా, మీ అందరు కూడా ఏదైతే తీర్మానం చేసిర్రో, ఏదైతే నా మీద అభిమానం ఉంచిర్రో, ఏదైతే నా మీద నమ్మకం, విశ్వాసాన్ని పెట్టిర్రో... మీ అందరి నమ్మకం, విశ్వాసం తగ్గకుండా కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పేలా, మీ ఆదేశాలు, ఆకాంక్షల మేరకు నడుచుకుంటా" అని చెప్పారు.
revant reddy
congress
kodangal

More Telugu News