madhumita: నాపై కోపంతోనే... మధుమితకు అసభ్య మెసేజ్ లు పంపుతున్న కారణమిదే: శివబాలాజీ

  • యూ ట్యూబ్ లో పెరిగిన నిరాధార ఆరోపణల వీడియోలు
  • నటీనటుల మార్ఫింగ్ చిత్రాలు కూడా
  • తాను ఖండించడంతోనే మధుమితపై వేధింపులు
  • మీడియాతో నటుడు శివబాలాజీ
తనపై ఉన్న కోపంతో తనను ఏమీ అనలేక కొంతమంది పనిగట్టుకుని తన భార్యను టార్గెట్ చేసుకున్నారని నటుడు శివబాలాజీ ఆరోపించాడు. తన భార్య మధుమితకు వస్తున్న అసభ్య మెసేజ్ లపై ఈ ఉదయం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.

గత కొంత కాలంగా సినిమా నటులపై యూ ట్యూబ్ వీడియోల్లో అశ్లీల వీడియోలు, నిరాధార ఆరోపణలు నిండిన వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు వస్తుండటం పెరిగిపోయిందని అన్నాడు. వాటిని తాను పలుమార్లు గట్టిగా ఖండించానని గుర్తు చేసిన శివబాలాజీ, అందువల్ల కొందరు తనపై కక్ష కట్టారని, ఈ ఎస్ఎంఎస్ లు పంపింది వారి మనుషులేనని ఆరోపించాడు. ప్రత్యేకించి ఎవరి పేర్లనూ వెల్లడించని శివబాలాజీ, అతి త్వరలోనే నిందితులను పోలీసులు అరెస్టు చేస్తారన్న నమ్మకం ఉందని అన్నాడు.
madhumita
siva balaji
cyberabad
police

More Telugu News