drunken drive: మద్యం మత్తులో పోలీసులతో వీరంగమాడిన పెద్దింటి అమ్మాయి!

  • డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలకు సహకరించని యువతి
  • పోలీసులతో వాదిస్తూ దుర్భాషలు  
  • అదుపు చేసేందుకు పోలీసుల అవస్థలు
  • అధిక మోతాదులో మద్యం తాగినట్టు నిర్ధారణ 
  • కేసు నమోదు, వాహనం స్వాధీనం

మద్యం తాగి వాహనాలు నడుపవద్దని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, ప్రతి వారమూ వందల మందిని అదుపులోకి తీసుకుని, జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నా మందుబాబుల వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. తాజాగా, నిన్న రాత్రి హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, 46 మంది యువతీ యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

ఈ క్రమంలో ఓ యువతి కారులో వస్తూ, పోలీసుల పరీక్షలకు ఎంతమాత్రమూ సహకరించేది లేదని మొండికేసింది. ఓ ఖరీదైన కారులో వచ్చిన ఈమె, పోలీసులపై దుర్భాషలాడింది. వారిపై వీరంగానికి దిగింది. ఆమెకు టెస్ట్ చేసేందుకు పోలీసులు కష్టాలు పడాల్సి వచ్చింది. ఆపై ఆమె అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని, కౌన్సెలింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. పట్టుబడ్డ 46 మందిలో 15 మంది యువతులు, మహిళలు ఉన్నారని తెలిపారు. మొత్తం 25 కార్లు, 21 బైకులను సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

More Telugu News