anupama: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • గ్లామర్ పాత్రలూ చేస్తానంటున్న అనుపమ 
  • 300 థియేటర్లలో హెబ్బా పటేల్ 'ఏంజెల్' 
  • నవంబర్ 10న వస్తున్న విశాల్ 'డిటెక్టివ్'
  • నానికి రెండు మిలియన్ల ఫాలోవర్స్!

*  ప్రస్తుతం హోమ్లీగా కనిపించే పాత్రల్లోనే కనిపిస్తున్న మల్లూబేబీ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్రలు కూడా చేస్తానంటోంది. "గ్లామర్ పాత్రలు తప్పకుండా చేస్తాను. నాకు అభ్యంతరం లేదు. అయితే, ఆ పాత్ర ఎందుకు అలా గ్లామర్ గా కనిపించాలన్న విషయాన్ని దర్శకుడు నాకు స్పష్టంగా చెప్పాలి. నేను కన్విన్స్ అయితే కనుక చేస్తాను" అని చెప్పింది.
*  హెబ్బా పటేల్, నాగ అన్వేశ్ జంటగా నటించిన 'ఏంజెల్' చిత్రాన్ని నవంబర్ 3న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోను కలిపి మొత్తం 300  థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాత 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి బాహుబలి పళని దర్శకత్వం వహించాడు.
*  విశాల్ హీరోగా తమిళంలో నటించిన 'తుప్పరివాలన్' చిత్రాన్ని 'డిటెక్టివ్'గా తెలుగులోకి అనువదిస్తున్నారు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించారు.
*  సోషల్ మీడియాను విరివిగా వాడుతూ, తన గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసే నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లు  (ఇరవై లక్షలు) దాటేసింది. ఈ సందర్భంగా అభిమానులకు నాని థ్యాంక్స్ చెప్పాడు.     

More Telugu News