brahmaji: పోసాని కృష్ణమురళి నాకు ఎంతో హెల్ప్ చేశాడు : బ్రహ్మాజీ

  • పోసాని చెన్నైకి వచ్చాక నా ఎదురు రూమ్ లోనే ఉండేవాడు
  • అందువలన ఆయనతో స్నేహం ఏర్పడింది
  • ఆయన తీసుకెళ్లి పరుచూరి బ్రదర్స్ కి పరిచయం చేశాడు 
  • చాలామందికి చెప్పి చాన్సులు ఇప్పించాడు      

"అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుండగా హెల్ప్ చేసిన వారెవరు?" అనే ఐ డ్రీమ్స్ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మాజీ .. పోసాని కృష్ణమురళి పేరు చెప్పారు. " చెన్నై వచ్చిన పోసాని కృష్ణమురళి అసిస్టెంట్ రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర చేరాడు. నా రూమ్ కి ఎదురుగా వున్న రూమ్ లోనే ఆయన ఉండేవాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్ ను తెల్లవారుజామున 3 గంటలవరకూ ఫెయిర్ చేస్తూ ఉండేవాడు. అందువలన పొద్దుటే కిటికీలో నుంచి లేపితే ఉలిక్కిపడి లేచేవాడు" అన్నారు.

 "పోసానితో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తరువాత నన్ను పరుచూరి బ్రదర్స్ ఆఫీసుకి తీసుకెళుతూ ఉండేవాడు. అప్పట్లో వాళ్ల ఆఫీస్ నూతన ప్రసాద్ ఇంటిపై ఉండేది. చాలామంది దర్శక నిర్మాతలు అక్కడికి వస్తుండేవాళ్లు. నన్ను అక్కడే ఉండమని చెబుతూ .. వచ్చిన వాళ్లందరికీ పోసాని నన్ను పరిచయం చేసేవాడు. ఆయన వలన పరుచూరి బ్రదర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్లకి పరిచయమున్న వాళ్ల సినిమాల్లో నన్ను దూర్చేసేవారు. అలా చాలా పాత్రలు చేశాను" అంటూ చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News