revant reddy: రేవంత్ రెడ్డితో పాటు విజ‌య‌వాడ చేరుకున్న టీటీడీపీ నేత‌లు

  • టీటీడీపీ నేత‌ రేవంత్‌ రెడ్డి పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం
  • నిన్న టీటీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు చ‌ర్చ‌
  • ఈ రోజు విజ‌య‌వాడ‌లో కూలంకుషంగా చ‌ర్చ‌
టీటీడీపీ నేత‌ రేవంత్‌ రెడ్డి పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న టీటీడీపీ నేత‌ల‌తో చ‌ర్చించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు వారిని విజ‌య‌వాడ‌కు ర‌మ్మ‌ని చెప్పారు. కాసేప‌ట్లో టీటీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు కూలంకుషంగా చ‌ర్చించ‌నున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌, రేవంత్‌రెడ్డి విజయవాడకు వెళ్లారు. రేవంత్ తీరుపైనే ప్ర‌ధానంగా చర్చించ‌నున్నారు. రేవంత్ రెడ్డి వివాదం చివ‌ర‌కు ఎలా ముగుస్తుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. 
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News