hardik pandya: రాహుల్ ద్రవిడ్ చెప్పింది ఆచరిస్తున్నాను: హార్దిక్ పాండ్య

  • భారత్-ఏ తరపున ఆడినప్పుడు ద్రవిడ్ నాకు పాఠాలు బోధించాడు
  • సహజసిద్ధంగా ఆడడమంటే పరిస్థితికి తగ్గట్టు ఆడడమని బోధించాడు
  • ఆట క్రికెటర్ కి బలం చేకూర్చాలే తప్ప బలహీనత కాకూడదని ద్రవిడ్ చెప్పాడు

రాహుల్ ద్రవిడ్ చెప్పిన పాఠాలే తాను ఆచరిస్తున్నానని టీమిండియా నయా సంచలన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తెలిపాడు. చివరి వన్డేకు సిధ్ధమవుతున్న నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో ముచ్చటిస్తూ, భారత్-ఏ జట్టుకు ఆడుతున్నప్పుడు జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆట ఎలా ఆడాలి అన్న విషయాన్ని చెప్పారని, ఆయన పాఠాలను తాను ఆచరిస్తున్నానని అన్నాడు. అందుకే మ్యాచ్ లో తనకు వ్యక్తిగత లక్ష్యాలంటూ ఏమీ ఉండవని చెప్పాడు. రికార్డుల గురించి అసలెంత మాత్రమూ పట్టించుకోనని చెప్పాడు. మ్యాచ్ లో పరిస్థితికి తగ్గట్టు ఆడాలని ద్రవిడ్ బోధించాడని తెలిపాడు.

 సహజసిద్ధమైన ఆటతీరు గురించి రాహుల్ ద్రవిడ్ చాలా బాగా చెప్పారు. ఆరు బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వెళ్లిన మరుక్షణమే బంతిని గాల్లోకి కొట్టడం నేచురల్ గేమ్ అవదని స్పష్టం చేశారని అన్నాడు. దానిని మూర్ఖత్వం అంటారని ద్రవిడ్ భోధించారని చెప్పాడు.

బంతిని, పరిస్థితిని అంచనా వేసుకుని, ఆ తరువాత జట్టు అవసరాలకి తగ్గట్టు ఆడడమే నేచురల్ గేమ్ అని ద్రవిడ్ చెప్పారని అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట అనేది క్రికెటర్ కు బలం చేకూర్చాలే తప్ప, ఆట ఆటగాడి బలహీనతగా మారకూడదని హితవు పలికాడని చెప్పాడు. దీనిపై ధోనీ, కోహ్లీలతో చర్చించానని అన్నాడు. వారు కూడా సానుకూలంగా స్పందించడంతో విజయం సాధించానని పాండ్యా తెలిపాడు. 

  • Loading...

More Telugu News