వీడియో పోస్ట్ చేసి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఘాటు విమ‌ర్శ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌!

Sat, Oct 28, 2017, 11:32 AM
  • గ‌తంలో ఓ స‌భ‌లో రాష్ట్ర విభ‌జ‌న గురించి మాట్లాడిన ప‌వ‌న్‌
  • తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని చెప్పిన జ‌న‌సేనాని
  • సెటైర్ వేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌
సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అస‌త్యం పలికాడ‌ని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని గతంలో ఓ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన వ్యాఖ్యను పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. ఇది స‌త్యాన్ని అప‌విత్రం చేయ‌డ‌మేన‌ని, ఇది విన్న వారి రియాక్ష‌న్ ఇలా ఉంద‌ని చెబుతూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన ఆ ఒక్క ప‌దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తూ విప‌రీత‌మైన కామెడీని జోడించాడు వ‌ర్మ‌. మీరూ చూడండి... 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement