mahesh: మహేశ్ .. బన్నీల మధ్య పోటీ తప్పడం లేదు

  • షూటింగు దశలో 'భరత్ అను నేను' 
  • ఏప్రిల్ 27న భారీ రిలీజ్ 
  • అదే రోజున 'నా పేరు సూర్య ' విడుదల
  • దర్శకుడిగా వక్కంతం వంశీ    

కొరటాల శివ కథను చెప్పేతీరు .. కథనాన్ని నడిపించే విధానం బాగుంటాయి. అందువలన ఆయన సినిమాలు సాధారణ ప్రేక్షకులకు కూడా అరటిపండు ఒలిచినట్టు అర్థమవుతాయి. ఆయన తాజా చిత్రంగా 'భరత్ అను నేను' రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో, ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

 ఇక అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టు ముందుగానే చెప్పారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చరణ్ 'రంగస్థలం' కూడా ఇంచుమించు ఆ సమయంలోనే వుంటుందనే టాక్ వినిపిస్తుండటం విశేషం.   

More Telugu News