Kerala: దేవుడొస్తున్నాడని.. ఏడాదికి రెండు సార్లు విమానాశ్రయాన్ని మూసేస్తున్నారు!

  • ఏటా రెండు సార్లు దేవుడి కోసం మూసుకుపోయే తిరువనంతపురం విమానాశ్రయం
  • షణ్ముగం బీచ్ కు వెళ్లేందుకు ఒకేదారి
  • దేవుడొస్తున్నాడంటే విమానాలు రద్దు చేసి, రన్ వేకి ఇరువైపులా గౌరవ సూచకంగా నిలబడే సీఐఎస్ఎఫ్ సిబ్బంది

అవును, దేవుడి కోసం విమానాశ్రయాన్ని ఏడాదికి రెండు సార్లు మూసేస్తారు. ఇది ఏ దేశంలోనో అనుకోకండి. మన దేశంలోనే కేరళ రాజధాని తిరువనంతపురంలోనే! దేశంలోని రద్దీ విమానాశ్రయాల్లో తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ఒకటి. కేరళలో పైన్ కునీ, అల్పస్సీ పండుగలు జరుగుతాయి. ఈ సమయంలో పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలకు షణ్ముగం బీచ్ లో తిరుస్నానం చేయిస్తారు. అనంతరం దేవాలయానికి తీసుకెళ్తారు.

 ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆలయం నుంచి ఈ షణ్ముగం బీచ్ కు వెళ్లేందుకు దగ్గర దారి ఒకే ఒకటి ఉంది. అది ఎయిర్ పోర్ట్ రన్ వే మీదుగా ఉంటుంది. దీంతో ఈ రెండు ఉత్సవాల సమయంలో తిరువనంతపురం విమానాశ్రయాన్ని మూసేస్తారు. విమానాలు ఆపేస్తారు. రన్ వేకు ఇరువైపులా సీఐఎస్ఎఫ్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడతారు. దీంతో దేవుడి కోసం ఏటా రెండు సార్లు మూతపడే విమానాశ్రయంగా తిరువనంతపురం విమానాశ్రయం రికార్డులకెక్కింది. 

More Telugu News