rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • లక్కీ ఛాన్స్ కొట్టిన రకుల్ ప్రీత్ 
  • నవంబర్ 1న 'జైసింహ' ఫస్ట్ లుక్ 
  • 'శైలజరెడ్డి అల్లుడు'గా చైతన్య 
  • బుల్లితెరకు కథానాయిక సంజన

*  తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ ను అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ పొందింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో రకుల్ ను నాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిన్నది 'స్పైడర్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.    
*  నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'జైసింహ' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఏభై శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. కాగా, నవంబర్ 1 న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు తాజా సమాచారం.
*  నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి 'శైలజ రెడ్డి అల్లుడు' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఇందులో శైలజ రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది.
*  తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించిన సంజన బుల్లితెరకు వస్తోంది. 'స్వర్ణ ఖడ్గం' పేరిట రూపొందే తెలుగు టీవీ సీరియల్ లో ఆమె ప్రధాన పాత్ర పోషించనుంది. 

  • Loading...

More Telugu News