anushka: `భాగ్‌మ‌తి` సినిమాలో అనుష్క ద్విపాత్రాభిన‌యం?

  • తుది స్థాయికి చేరుకున్న‌ షూటింగ్‌
  • తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌లకు ప్లాన్ 
  • అనుష్క పుట్టిన‌రోజున ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల 

`బాహుబ‌లి` చిత్రాల త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న భాగ్‌మ‌తి చిత్రంలో ఆమె ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో ఒక పాత్ర ప్రేక్ష‌కులు ఊహించని రీతిలో ట్విస్ట్ తో సాగుతుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. అలాగే న‌వంబ‌ర్ 7న అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ద్వారా మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో జ‌య‌రాం, ఆది పినిశెట్టి, ఆశా శ‌ర‌త్‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జి. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుండ‌గా థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

More Telugu News