nagashourya: నాగశౌర్య న్యూ మూవీ టైటిల్ 'ఛలో'

  • నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
  • సొంత బ్యానర్ పై నిర్మాణం 
  • దర్శకుడిగా వెంకీ కుడుముల
  • కథానాయికగా రష్మిక మందన         

లవర్ బాయ్ గా నాగశౌర్యకు యూత్ లో మంచి క్రేజ్ వుంది. కొంత కాలంగా మంచి కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయనకి, వెంకీ కుడుముల ఒక కథను వినిపించాడు. ఆ కథ నచ్చడంతో సొంత బ్యానర్లో సినిమా చేయాలని నాగశౌర్య తల్లిదండ్రులు   నిర్ణయించుకున్నారు. అలా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకి 'ఛలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారినందుకు హ్యాపీగా ఉందని నాగశౌర్య తల్లిదండ్రులు చెప్పారు. నాగశౌర్య క్రేజ్ ను మరింతగా పెంచేదిగా ఈ సినిమా ఉంటుందంటూ దర్శకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కథానాయికగా రష్మిక మందన కూడా చాలా బాగా చేసిందనీ, డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు.        

More Telugu News