ram: 'ఉన్నది ఒకటే జిందగీ'లో రామ్ అదరగొట్టేశాడట!

  • ఈ రోజునే విడుదలైన 'ఉన్నది ఒకటే జిందగీ' 
  • రామ్ నటనకు మంచి మార్కులు 
  • అనుపమ పాత్రకు ప్రశంసలు      
రామ్ .. శ్రీ విష్ణు .. అనుపమ పరమేశ్వరన్ .. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన 'ఉన్నది ఒకటే జిందగీ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ 'అభిరామ్' పాత్రను పోషించాడు. ఈ సినిమా చూసినవాళ్లు 'అభిరామ్' పాత్రలో రామ్ అదరగొట్టేశాడని చెబుతున్నారు. ఎప్పటిలానే ఆయన డాన్స్ .. ఫైట్స్ విషయాల్లో ఎనర్జిటిక్ గా కనిపించాడనీ, ఎమోషనల్ సీన్స్ లోను అద్భుతంగా నటించాడని అంటున్నారు.

 కొన్ని కీలకమైన సన్నివేశాల్లో రామ్ పలికించిన హావభావాలు, నటనలో ఆయన సాధించిన పరిణతికి అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. డిఫరెంట్ లుక్స్ తో రామ్ ఆకట్టుకున్నాడంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ తరువాత స్థానంలో అనుపమ కనిపిస్తుందని చెబుతున్నారు. సున్నితమైన భావోద్వేగాలను పలికించే 'మహా' పాత్రలో ఆమె చాలా సహజంగా నటించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.         
ram
anupama

More Telugu News