chandrababu: ఇలాంటివి ఎన్నో చూశా... ఎవరున్నా, పోయినా ఒకటే: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • సంక్షోభాలు చాలానే వచ్చాయి
  • అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచాం
  • ప్రజాబలమే నాకు ముఖ్యం
  • టీటీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు
ఈ మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన వేళ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తొలుత పెద్దవిగా కనిపిస్తాయని, ఆపై చిన్నవైపోతాయని చెప్పారు. తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.

పార్టీ నుంచి ఎవరు పోయినా తాను లెక్క చేయనని, తనకు కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాబలమే ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం తనకుందని, అందుకు తగ్గ కృషి నాయకులు కూడా చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరితో తనకు మాట్లాడాలని ఉన్నా, ఇప్పుడు కుదరడం లేదని చెప్పిన చంద్రబాబు, అందరినీ విజయవాడకు రమ్మని పిలుస్తూ, సమావేశం ముగిసినట్టు ప్రకటించారు.
chandrababu
tTelugudesam leaders
revant reddy
l ramana

More Telugu News