jagan: రాష్టపతి గారికి... మేము అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం, మీరు కల్పించుకుంటేనే ప్రజాస్వామ్యం: కోవింద్ కు వైఎస్ జగన్ లేఖ

  • ఫిరాయింపులను ప్రోత్సహించడమే చంద్రబాబు పని
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు
  • ఫిరాయించిన వారి రాజీనామాలు ఆమోదించాలి
  • తమరు కల్పించుకోవాలని రాష్ట్రపతిని కోరిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అభివృద్ధి, పరిపాలనను పక్కనబెట్టి, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తూ, వైకాపా అధినేత వైఎస్ జగన్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు, బాధ్యతలను మరచి అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఈ లేఖలో జగన్ ఆరోపించారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన వారిని తెలుగుదేశంలో చేర్చుకున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలన్న తమ డిమాండ్ పై స్పీకర్ చర్య తీసుకోకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా వైకాపా తరఫున ఎంపికైన ఎమ్మెల్యేలను తన పక్కన చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చారని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు వైఖరికి నిరసనగా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని కోవింద్ కు పేర్కొన్నారు. ఈ నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేలా కలుగజేసుకోవాలని ఈ లేఖలో కోవింద్ ను జగన్ కోరారు. టీడీపీలో చేర్చుకున్న వారితో రాజీనామాలు చేయిస్తే, తాము అసెంబ్లీకి హాజరవుతామని అన్నారు. ఈ మేరకు కోవింద్ కు రాసిన లేఖ పూర్తి పాఠాన్ని జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచారు. ఆ లేఖను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News