touch screen: ఈ ట‌చ్ స్క్రీన్ ప‌గిలి పోయే ఛాన్సే లేదు!

  • త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు
  • ధ‌ర కూడా అందుబాటులోనే
  • రూపొందించిన ఇంగ్లండ్‌లోని స‌సెక్స్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు

ట‌చ్ స్క్రీన్ ఫోన్ల‌లో స్క్రీన్ ప‌గిలిపోతే దానిలో ఎన్ని ఫీచ‌ర్లు ఉన్నా నిరుప‌యోగ‌మే అవుతాయి. అలా కాకుండా అస‌లు ప‌గిలిపోయే ఛాన్సే లేని ట‌చ్ స్క్రీన్‌ను ఇంగ్లండ్‌లోని స‌సెక్స్ యూనివర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు త‌యారుచేశారు. ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌గా పిలిచే ఈ ట‌చ్ స్క్రీన్ల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. సిల్వర్, గ్రాఫీన్‌ల స‌మ్మేళ‌నంతో పర్యావరణహిత స్క్రీన్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తక్కువ విద్యుత్‌ ఉపయోగించుకోవడంతో పాటు ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంటుందని వారు పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న టచ్‌స్క్రీన్స్‌ తయారీలో వాడే ఇండియమ్‌ టిన్‌ ఆక్సైడ్‌ పెళుసుగా ఉండటంతోపాటు ధర కూడా ఎక్కువ. అలాగే ఇండియమ్‌ చాలా అరుదైన లోహం, దీనివల్ల పర్యావరణానికి కూడా హాని జరుగుతుందని తెలిపారు. సిల్వర్‌ ధర కూడా ఎక్కువే అయినప్పటికీ, సిల్వర్‌ నానోవైర్లను గ్రాఫీన్‌కు జతచేయడం ద్వారా తక్కువ ధరకే ఈ నూతన స్క్రీన్‌ను తయారు చేసినట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ససెక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. ఇంతకుముందే సిల్వర్‌ నానోవైర్లను టచ్‌స్క్రీన్స్‌లో ఉపయోగించినా.. ఎవరూ గ్రాఫీన్‌తో తయారు చేయలేదని వర్సిటీ పరిశోధకులు డాల్టన్‌ చెప్పారు.

  • Loading...

More Telugu News