ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ.. తీవ్ర గందరగోళం!
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ వాయిదా తీర్మానం
- ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామన్న డిప్యూటీ స్పీకర్
ఈ సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోందని... దీని తర్వాత వాయిదా తీర్మానం చేపడదామని సభ్యులకు సూచించారు. అయినా విపక్ష సభ్యులు వాయిదా తీర్మానం చేపట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల మధ్యే అధికారపక్ష సభ్యుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా విపక్షసభ్యులు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.