air hostess: ఆగిన విమానం నుంచి జారిపడి ప్రాణాలతో పోరాడుతున్న ఎయిర్ హోస్టెస్!

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
  • మెట్లు అమర్చుతుండగా కాలు జారి కిందపడిన ఎయిర్ హోస్టెస్
  • పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు 
ఆగివున్న ఓ విమానానికి మెట్లను అమర్చుతున్న వేళ, ఓ ఎయిర్ హోస్టెస్ ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతోంది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. ఒమన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం మస్కట్ నుంచి వచ్చి పార్కింగ్ బేకు చేరుకుంది.

విమానానికి స్టెప్స్ అమర్చుతుండగా, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎయిర్ హోస్టెస్ కిందపడింది. దీన్ని గమనించిన ఇతర సిబ్బంది ఆమెను ఎయిర్ పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల కారణంగా ఆమె పరిస్థితి విషమంగా మారడంతో, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
air hostess
shamshabad

More Telugu News