British adventurer: అద్భుతం: వంద హీలియమ్ బెలూన్స్‌తో 8 వేల అడుగుల పైకెగిరిన సాహసికుడు.. మీరూ చూడండి!

  • రికార్డు సృష్టించిన బ్రిటిష్ సాహసికుడు మోర్గాన్ 
  • కమర్షియల్‌గా విజయం సాధించకపోవచ్చని వ్యాఖ్య
  • తన స్టంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న మోర్గాన్

చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ ప్రపంచంలో సాహసాలకు కొదవలేదు. వినూత్న ఆలోచనలు మనుషులను ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంచుతాయి. బ్రిటిష్ సాహసికుడు టామ్ మోర్గాన్ కూడా అలానే ఆలోచించాడు. రికార్డులు బద్దలుగొట్టాడు. రంగురంగుల బెలూన్లు వంద సేకరించి అందులో హీలియం నింపి అన్నింటినీ జోడించి వాటి సాయంతో ఏకంగా విమానం ఎగిరేంత ఎత్తు అంటే 8 వేల అడుగుల పైకెగిరాడు.

దక్షిణాఫ్రికా గగనతలంపై ఈ సాహసకృత్యం నిర్వహించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తన స్టంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న మోర్గాన్ ఈ ఫీట్ అనంతరం మాట్లాడుతూ హీలియం నింపిన బెలూన్లతో అంత ఎత్తుకు ఎగరడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అయితే ఇది కమర్షియల్‌గా విజయం సాధించకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. మోర్గాన్ సాహసకృత్యాన్ని మీరూ వీక్షించండి!

More Telugu News