Shruti: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • ఆ క్రెడిట్ అందరికీ పంచాలంటున్న శ్రుతి
  • తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్టీఆర్ బయోపిక్ 
  • ముగింపు దశలో అల్లు శిరీష్ చిత్రం 
  • బల్గేరియాకు బయలుదేరిన పవన్

*  'ఒక సినిమా హిట్టయిందంటే ఆ క్రెడిట్ అందరికీ పంచాలి' అంటోంది బ్యూటీ క్వీన్ శ్రుతి హాసన్. "సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ నా ఒక్కదానిదే కాదు. అలాగే, పరాజయం కూడా అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే, సినిమా నిర్మాణం అనేది సమష్టి కృషి. గతంలో పరాజయాలను నా ఖాతాలో వేసేవారు. అది చాలా తప్పు" అని చెప్పుకొచ్చింది.
*  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనున్న సంగతి విదితమే. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వచ్చే మే 28న విడుదల చేస్తారు.
*  'ఎక్కడికి పోతావు చిన్నవాడ' ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సురభి, శీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 29 నుంచి బల్గేరియాలో పదిహేను రోజుల పాటు జరుగుతుంది. అక్కడ రెండు పాటలు, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందుకోసం యూనిట్ అక్కడికి బయలుదేరి వెళ్లింది.   

  • Loading...

More Telugu News