brahmaji: నెలకి 250 రెంట్ ఇస్తూ నేను, కృష్ణవంశీ చిన్న చిన్న రూమ్స్ లో ఉండేవాళ్లం : బ్రహ్మాజీ

  • 'శివ' సినిమాకి ముందునుంచే కృష్ణవంశీతో పరిచయం
  • పాండీ బజార్లో కలుసుకునేవాళ్లం
  • ప్రతి రోజు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్లం

" 'సిందూరం' సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ సినిమాలో ఒక హీరోగా మిమ్మల్నే కృష్ణవంశీ ఎంచుకోవడానికి కారణమేంటి?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీకి ఎదురైంది. " ఆ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం 'శివ' సినిమా ముందు నుంచి కృష్ణవంశీతో నాకు గల పరిచయమే" అని బ్రహ్మాజీ చెప్పారు. " చెన్నై పాండీబజార్ లో అయిదు అంతస్తులు గల ఓ బిల్డింగ్ ఉండేది. అందులో 100 చిన్న చిన్న రూములు ఉండేవి.

ఒక రూములో ఇద్దరికి మించి ఉండటం కుదరదు .. నెలకి 250 రూపాయలు రెంట్. ఒక రూములో నేను .. మరో రూములో కృష్ణవంశీ ఉండేవాళ్లం. ఉదయాన్నే సినిమా ఆఫీసుల వెంట తిరగడం .. ఫోటోలు ఇవ్వడం .. సాయంత్రం అంతా పాండీబజార్లో కలుసుకుని మాట్లాడుకోవడం చేసేవాళ్లం. ఆ సమయంలోనే కృష్ణవంశీతో పరిచయం ఏర్పడింది. కొత్త వాళ్లతో అన్నపూర్ణ వాళ్లు 'శివ' సినిమా చేస్తున్నట్టుగా అప్పుడే తెలిసింది. ఆ సినిమాకి కో డైరెక్టర్ శివనాగేశ్వరరావు. ఆయనని కలుసుకోవాలని కృష్ణవంశీ అంటే .. నా బైక్ పైనే తీసుకెళ్లాను" అని చెప్పారు.      

More Telugu News