hyderabad: హైద‌రాబాద్‌లో ర‌హ‌దారిపై యువ‌తి వీరంగం.. వాహనదారుడిపైకి దూసుకెళ్లిన వైనం!

  • బేగంపేట‌ ర‌హ‌దారిపై వేగంగా కారు న‌డిపిన యువ‌తి
  • స‌రిగ్గా న‌డ‌ప‌మ‌ని చెప్పినందుకు వాహ‌న‌దారుడిని కొట్ట‌బోయిన యువ‌తి
  • అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌

హైద‌రాబాద్‌లోని బేగంపేట‌ ర‌హ‌దారిపై ఓ యువ‌తి వీరంగం సృష్టించింది. రోడ్డుపై కారులో వెళుతూ వేగంగా డ్రైవింగ్ చేస్తూ వాహ‌న‌దారుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఇలా న‌డిపిస్తున్నావేంట‌ని అడిగినందుకు త‌న కారుని రోడ్డుపైనే ఆపేసి, ఓ వాహ‌నదారుడిని కొట్టడానికి వ‌చ్చింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందే వాహ‌నదారుడిపై చేయి చేసుకోబోయింది.

ఇద్దరికీ న‌చ్చ‌చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్క‌డి నుంచి వారిని పంపించిన త‌రువాత కూడా ఆ యువ‌తి ఊరుకోలేదు. త‌న‌తో గొడ‌వప‌డ్డ వాహ‌న‌దారుల బైక్ ను త‌న కారుతో వెంబ‌డించి మ‌రోసారి గొడ‌వ పెట్టుకుంది. ఈ దృశ్యాల‌ను వాహ‌న‌దారులు త‌మ కెమెరాల్లో బంధించారు. ఆ యువ‌తి తీరుపై మండిప‌డ్డారు. ఆ యువ‌తికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌రాలేదు.  

More Telugu News