ys jagan: జగన్ పాదయాత్ర పేరు మారింది.. కొత్త పేరు 'ప్రజా సంకల్పం'!

  • పాదయాత్రకు 'ప్రజా సంకల్పం' పేరు ఖరారు
  • 'అన్నొస్తున్నాడు' పేరుతో చేపట్టాలని గతంలో భావించారు
  • వచ్చే నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభం

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్రను 'అన్నొస్తున్నాడు' అనే పేరుతో చేపట్టాలని గతంలో అనుకున్నారు. అయితే, ఈ రోజు జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాదయాత్ర పేరును 'ప్రజా సంకల్పం'గా మార్చారు. ప్రజల్లో ఉన్న బలమైన సంకల్పాన్ని ఈ పేరు సూచిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. 

More Telugu News