nawaz sharif: నవాజ్ షరీఫ్ కు అరెస్ట్ వారెంట్ జారీ!

  • షరీఫ్ పై అక్రమాస్తుల కేసు
  • విదేశాల్లో భారీగా ఆస్తులు పోగేశారంటూ ఆరోపణ
  • కోర్టు విచారణకు హాజరుకాని షరీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అవినీతి, అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణకు షరీఫ్ హాజరు కాకపోవడంతో లాహోర్ అవినీతి నిరోధక కోర్టు జడ్జి మొహమ్మద్ బషీర్ వారెంట్ జారీ చేశారు. షరీఫ్ భార్య లండన్ లో వైద్య చికిత్స తీసుకుంటున్నారని... ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ షరీఫ్ తరపు న్యాయవాది కోరారు. ఈ విన్నపాన్ని జడ్జి తోసి పుచ్చారు. నవంబర్ 3వ తేదీన తదుపరి విచారణ ఉంటుందంటూ విచారణను వాయిదా వేశారు.

కాగా, పాకిస్థాన్ చట్టాల ప్రకారం విదేశాల నుంచి షరీఫ్ తిరిగి రాగానే ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తదుపరి విచారణలోపు బెయిల్ తెచ్చుకోకపోతే అరెస్ట్ తప్పదు. అవినీతి సంపాదనతో విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులను పోగేశారంటూ షరీఫ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విచారణ వాయిదాలకు షరీఫ్ హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వారెంట్ జారీ అయింది.

  • Loading...

More Telugu News