kancha ilaiah: ఈ విషయంలో కంచ ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి: టీజీ వెంకటేష్

  • కమ్యూనిస్టులు ఐలయ్య నామస్మరణ చేస్తున్నారు
  • ఐలయ్య సన్మానసభను అడ్డుకోం
  • ఆర్యవైశ్యులను ఏమైనా అంటే మాత్రం ఊరుకోం
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి మండిపడ్డారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించరాదంటూ ఆయన హితవు పలికారు. విజయవాడలో ఈ నెల 28న జరగనున్న కంచ ఐలయ్య సన్మానాన్ని అడ్డుకోబోమని... అయితే, ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించబోమని హెచ్చరించారు.

ఐలయ్య రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదని చెప్పారు. ఆర్యవైశ్యులు కూడా ద్రావిడులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. కమ్యూనిస్టులు కూడా ఐలయ్య నామస్మరణ చేస్తున్నారని... వీరిలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఐలయ్యకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 
kancha ilaiah
tg venkatesh
Telugudesam

More Telugu News