mersal movie: జీఎస్టీని విమర్శిస్తూ మరో తమిళ సినిమా!

  • జీవా నటిస్తున్న 'కీ' సినిమా ప్రోమో విడుదల
  • జీఎస్టీపై సినిమాలో డైలాగులు
  • ప్రోమోపై స్పందించని బీజేపీ నేతలు

స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' సినిమా తమిళనాటే కాకుండా, దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. జీఎస్టీపై ఈ సినిమాలో ఉన్న డైలాగులు బీజేపీ నేతలను కలవరపరచడమే దీనికి కారణం. ఈ డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, బీజేపీ నేతలు మాత్రం మండిపడ్డారు. మరోవైపు, రజనీకాంత్, విశాల్ ల దగ్గర నుంచి పలువురు తమిళ సినీ ప్రముఖులు మెర్సల్ సినిమాకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో, విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారుల దాడులు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఇప్పుడు తాగా జీఎస్టీని ఎద్దేవా చేస్తూ మరో తమిళ చిత్రం రాబోతోంది. 'రంగం' సినిమా ఫేం జీవా నటించిన 'కీ' చిత్రం ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో జీఎస్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు. అయితే, ఈ ప్రోమోపై ఇంతవరకు బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు.

More Telugu News