Uttam Kumar Reddy: అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: టీపీసీసీ అధ్యక్షుడు

  • రైతుల పట్ల తెలంగాణ ప్ర‌భుత్వం వ‌హిస్తోన్న‌ నిర్లక్ష్యం స‌రికాదు
  • ఈనెల 27న ఛలో అసెంబ్లీ
  • రానున్న ఎన్నిక‌ల్లో మా పార్టీయే గెలిచి అధికారంలోకి వ‌స్తుంది

రైతుల పట్ల తెలంగాణ ప్ర‌భుత్వం వ‌హిస్తోన్న‌ నిర్లక్ష్యం స‌రికాద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ తీరుకు నిరసనగా ఈనెల 27న 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగు విడతలుగా చేసిన రుణమాఫీతో రైతుల‌కు చేకూరిన ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో హామీలు ఇచ్చింద‌ని, అవి ఇప్ప‌టివ‌ర‌కు నెర‌వేర‌లేద‌ని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ నిర్ల‌క్ష్య‌పూరిత తీరుతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ పార్టీయే గెలిచి అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమాగా చెప్పారు.  

  • Loading...

More Telugu News