revanth reddy: టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది.. జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదు: రేవంత్ రెడ్డి

  • చంద్రబాబు వచ్చేంత వరకు ఎవరితోనూ మాట్లాడను
  • నాపై బాబు ఎంతో నమ్మకాన్ని ఉంచారు
  • గోల్కొండ హోటల్ లో భేటీపై సమాచారం లేదు
రేపు జరగనున్న టీడీఎల్పీ సమావేశం యథావిధిగా కొనసాగుతుందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు. తమ అధినేత చంద్రబాబు స్వదేశానికి తిరిగి వచ్చేంత వరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు ఎంతో నమ్మకాన్ని ఉంచారని తెలిపారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో రేపు టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 1 గంటకు టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డిని కేవలం ఎమ్మెల్యే హోదాలో మాత్రమే పిలుస్తామని తెలిపారు.
revanth reddy
l ramana
tTelugudesam
tdlp

More Telugu News