mamatha banerjee: నా ఫోన్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోను... ఏమైనా చేసుకోండి!: మమతా బెనర్జీ

  • కావాలంటే నా నంబర్ కట్ చేసుకోండి
  • నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తాం
  • నల్ల జెండాలతో నిరసన తెలుపుతాం
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని... కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను సుప్రీంకోర్టు ఈ నెల 30వ తేదీన విచారించబోతోంది. మరోవైపు, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఈనెల 8వ తేదీన బ్లాక్ డే నిర్వహించనున్నట్టు దీదీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ఆమె వెల్లడించారు.
mamatha banerjee
tmc
west bengal chief minister

More Telugu News