team India: బ్యాటింగ్ ప్రారంభించి...తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

  • పూణేలో ప్రారంభమైన రెండో డే అండ్ నైట్ వన్డే
  • కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకున్న కోహ్లీ
  • గుప్టిల్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

పూణే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా భారత జట్టు ఒక మార్పు చేసింది. మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకుంది. చక్కగా బౌలింగ్ చేయడంతో పాటు భారీ షాట్లు బాదే సత్తా అక్షర్ పటేల్ కు కలిసివచ్చింది.

 తొలి వన్డేలో తొలుత ఫీల్డింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఎండవేడిమికి తాళలేకపోయిన సంగతి తెలిసిందే. 21వ ఓవర్ లో ఎండ కారణంగా అస్వస్థతకు గురైన బౌలర్ గ్రాండ్ హోమ్ మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్తబంతిని అందుకున్న భువనేశ్వర్ కుమార్ చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టి జోరందుకుంటున్న మార్టిన్ గుప్లిల్ ను భువీ చక్కని బంతితో పెవిలియన్ కు పంపాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. 

More Telugu News