l ramana: మా దగ్గరికి రావద్దు, టీడీపీ కార్యక్రమాలు పెట్టొద్దు: రేవంత్ కు ఎల్.రమణ ఆదేశాలు

  • పార్టీ పేరిట కార్యక్రమాలు వద్దు
  • రేవంత్ ను ఎవరూ ఆహ్వానించొద్దు
  • ఆయన తొలగింపు గ్యారెంటీనన్న ఎల్.రమణ!
ఇకపై తాము నిర్వహించే సమావేశాలకు రేవంత్ రెడ్డి రానవసరం లేదని, టీడీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాలకు ఆయనకు అనుమతి లేదని తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాసిన ఆయన, తాజాగా మరిన్ని ఆదేశాలు జారీ చేశారు.

తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించవద్దని రేవంత్ ను ఆదేశించిన ఆయన, పార్టీ కార్యక్రమాలకు రేవంత్ ను ఆహ్వానించ వద్దని నేతలకు సూచించారు. రేవంత్ పై పార్టీ చీఫ్ చంద్రబాబు నిర్ణయం తీసుకునేంత వరకూ తన ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన అన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవుల నుంచి ఆయన తొలగింపు ఖాయమని, అందులో ఎటువంటి సందేహాలు లేవని తన సన్నిహితుల వద్ద ఎల్.రమణ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
l ramana
revant reddy
Telugudesam

More Telugu News