suhana khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ కుతురా? మజాకా?

  • స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న షారూఖ్ కుమార్తె సుహానా
  • ఈ వేడుకలకు గ్యిసెప్ జానొట్టి బ్రాండ్ 'జెన్నిఫర్ వెడ్జ్ స్నీకర్స్' షూ వేసుకెళ్లిన సుహానా
  • ఈ షూ ధర 64,000 రూపాయలు

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులన్న విషయం తెలిసిందే. ఆయన కూతురు సుహానా ఖాన్ స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంది. ఈ వేడుకలకు సుహానా వేసుకెళ్లిన షూ 'టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా'గా నిలుస్తోంది.

ఆమె ధరించిన షూ ఖరీదుతో థాయిలాండ్ వెళ్లి చూసి రావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే, ఆమె ధరించిన 'గ్యిసెప్ జానొట్టి' బ్రాండ్ షూ అత్యంత ఖరీదైనది. జెన్నిఫర్ వెడ్జ్ స్నీకర్స్ గా పేర్కొనే ఈ షూ ధర అక్షరాలా 64 వేల రూపాయలు. డిజైనర్ షూ కావడంతో దీనికి ఇంత ఖరీదని ఈ బ్రాండ్ గురించి తెలిసిన వారు పేర్కొంటున్నారు. అయితే కేవలం కాళ్లకు ధరించడానికే 64,000 రూపాయలు ఖర్చు పెడితే కళ్లకు, ఇతర సామగ్రికి సుహానా ఎంత ఖర్చు పెడుతుంది? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎంతైనా కింగ్ ఖాన్ కూతురా? మజాకా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News